‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హకు ఎంతో కీలకమైందని, ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటు హకు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. త్వరలోనే చేపట్టే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, గ్రామగ్రామాన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
- కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
- జోగిన్‌పల్లి, పైడిమడుగులో బీఎల్ఏలకు అవగాహన
కోరుట్ల రూరల్, జూన్ 29: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హకు ఎంతో కీలకమైందని, ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటు హకు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. త్వరలోనే చేపట్టే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, గ్రామగ్రామాన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం కోరుట్ల మండలంలోని జోగిన్‌పల్లి, పైడిమడుగు గ్రామాల్లో వేర్వేరుగా బీఎల్ఏలతో కలిసి ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన ఆయన, ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు.
ఆయాచోట్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్ ప్రక్రియలో ప్రతిఒకరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, బూత్ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. సర్ ప్రక్రియలో ఓటర్ల వివరాల పరిశీలన, అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపుల విషయంలో నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలన్నారు. ఆయా సమావేశాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, నాయకులు దుంపల రాజనర్సయ్య, గడిగొప్పుల గోపాల్, తురగ సంజీవరెడ్డి, పల్లికొండ నరేశ్, దేవారెడ్డి, సామ నాగేశ్వర్, బుచ్చిరెడ్డి, సురేందర్ రావు, నర్సయ్య, దేవయ్య, నరేశ్, రమేశ్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

