వేములవాడ, అక్టోబర్ 22: అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో గులాబీ గూటికి చేరికల పర్వం జోరందుకున్నది. బీఆర్ఎస్ వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో ఇప్పటికే వేలాది మంది యువకులు, మహిళలు, కులసంఘాల సభ్యు లు, ఇతర పార్టీల నాయకు లు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
ఆదివారం కథలాపూర్ మండలం దూలూరుకు చెందిన సుమారు 50మంది యువకులు మార్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జడ్పీటీసీ నాగం భూమయ్య, ఏఎంసీ చైర్మన్ సౌజన్య-గంగాధర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మిట్టపల్లి లక్ష్మి-గంగారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీ-నాగరాజు, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జూపాక మహేశ్, నేతలు మిర్యాల వెంకటేశ్వరరావు, మేడిపల్లి రాజిరెడ్డి ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరారు.
ఈ సందర్భంగా వేములవాడలోని తన నివాసంలో చల్మెడ వారికి కం డువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అలాగే కోనరావుపేట మం డలం కొలనూర్కు చెందిన పలువురు యువకులకు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి స్వాగతం పలికారు. యువకులు కష్టపడి పనిచేయాలని చల్మెడ సూచించారు. చల్మెడ గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేస్తామని పార్టీలో చేరిన యువకులు స్పష్టం చేశారు.