Dharmaram Model School | ధర్మారం, సెప్టెంబర్11: ధర్మారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో గురువారం పెద్దపల్లి మై భారత్, పత్తిపాక యువశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (ఒక మొక్క అమ్మ పేరున నాటుదాం) కార్యక్రమం నిర్వహించారు. ఆ పాఠశాల విద్యార్థులు పాఠశాలకు వెళ్లే దారిలో ఇరువైపులా మొక్కలు నాటారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మ పేరిట మొక్క నాటే కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు.
నాటిన మొక్కలను విద్యార్థులు సంరక్షించాలని అన్నారు. నేడు నాటిన మొక్కలే భవిష్యత్తులో వృక్షాలుగా ఎదిగి స్వచ్ఛమైన గాలిని అని అన్నారు. గాలి కలుషితం కాకుండా స్వచ్ఛంగా ఉండాలి అంటే కచ్చితంగా మొక్కలు అధికంగా నాటాలని అన్నారు. తద్వారా సకాలంలో వర్షాలు కూడా కురుస్తాయని విద్యార్థులకు రాజ్ కుమార్ వివరించారు.
అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు .ఈ కార్యక్రమంలో పత్తిపాక యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మహేష్, కార్యదర్శి సిద్ధార్థ, రాహుల్, అనుదీప్, సభ్యులు ఇర్ఫాన్, రాకేష్, నితిన్ యువకులు పాల్గొన్నారు.