కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఒర్రెలో శుక్రవారం పాల ప్యాకెట్లు కనిపించడం కళకళరేపింది. ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు అందా ల్సిన పాలప్యాకెట్లు ఇలా వృథాగా ఒర్రెలో పడి ఉన్నాయి. గడువు దాటిన తేదీ ఉండడంతో ఎవరో ఇక్కడ పడేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు అందాల్సిన పాలప్యాకెట్లను వృథా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ తుల మనోహర్రావు కోరుతున్నారు. ఈ విషయమై అంగన్వాడీ సూపర్వైజర్ సావిత్రిని వివరణ కోరగా, మొట్లపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో విచారణ చేస్తున్నామని, నివేదికను జిల్లా అధికారులకు పంపిస్తామని తెలిపారు.
– కాల్వశ్రీరాంపూర్, మార్చి20