Padi Kaushik Reddy | టైం నువ్వే చెప్పు.. ఏ సబ్జెక్ట్ మీదైనా సరే చర్చకు వచ్చే ధైర్యం ఉందా..? : బండి సంజయ్‌కి పాడి కౌశిక్ రెడ్డి చాలెంజ్
Padi Kaushik Reddy | కేంద్రమంత్రి కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని, ఓ అమ్మకు అబ్బకు పుట్టినవారైతే చర్చలకు రావాలని బండి సంజయ్ మాట్లాడటం ఎంత వరకు సమంజసమన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తనపై దాడి చేసిన వారంతా రౌడీ షీటర్లేనని తెలిపారు.
Padi Kaushik Reddy | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరు కలిసే నాపై హత్యా ప్రయత్నం చేశారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్లో తనపై, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై కర్రలు, రాడ్లతో దాడి చేసిన ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎవరిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని అన్నందుకే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
కేటీఆర్‌ను బండి సంజయ్ అన్న మాటలకే కౌంటర్ ఇచ్చానే తప్పా.. నేను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. కేంద్రమంత్రి కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని, ఓ అమ్మకు అబ్బకు పుట్టినవారైతే చర్చలకు రావాలని బండి సంజయ్ మాట్లాడటం ఎంత వరకు సమంజసమన్నారు. తనపై దాడి చేసిన వారంతా రౌడీ షీటర్లేనని తెలిపారు. దాడిపై మర్డర్ కేసు నమోదు చేయాలన్నారు. క్యాంప్ ఆఫీస్‌పై దాడి జరుగుతుంటే కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించాడు. ఓ ఎమ్మెల్యేపై కర్రలు, కత్తులతో దాడికి పాల్పడితే సామాన్యుల పరిస్థితి ఏంటని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ప్రాణాలు పోయినా పోరాటం ఆపమన్నారు.
చంపుతామని బెదిరించడం ఏంటి..?
నాపై రెక్కీ నిర్వహిస్తున్నారు.. చంపుతారని ముందే చెప్పా. కర్రలు, కత్తులు , పెట్రో బాంబులతో దాడి చేశారు. కరీంనగర్‌కు గన్ కల్చర్ తెచ్చారు, ఇది మంచి పద్దతి కాదనే నేను మాట్లాడాను. దొంగలను ఎందుకు పట్టుకోలేదనే నేను అడిగితే నాపై దాడి చేశారు. యూపీ నుంచి దోపిడీ దొంగలు, హంతకులు వస్తుంటే ఏం చేస్తున్నారు..? మేమేం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. ఈ దాడులు ఏంటి..? చంపుతామని బెదిరించడం ఏంటి..? ఇదేం పద్దతి అని ప్రశ్నించారు.
బండి సంజయ్.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే, చర్చకు రా..గీతా భవన్ చౌరస్తాలో చర్చకు మేము సిద్ధం.. కరీంనగర్ గడ్డ మీద నుంచి నేను సవాల్ విసురుతున్నా. సమయం నువ్వే చెప్పు.. రావడానికి మేము రెడీ.. ఇరిగేషన్, ఐటీ, సివిల్ సప్లైస్.. ఇలా ఏ సబ్జెక్ట్ మీదైనా సరే, అర్థం పర్థం లేని విమర్శలు మానేసి చర్చకు వచ్చే ధైర్యం ఉందా..? అని పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు. మీరు సబ్జెక్ట్ మాట్లాడకుండా మమ్మమ్మే, తత్తత్తే, బెబ్బెబ్బే అంటే కుదరదు బండి సంజయ్ అని ఎద్దేవా చేశారు.
బండి సంజయ్.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే, చర్చకు రా..
గీతా భవన్ చౌరస్తాలో చర్చకు మేము సిద్ధం..
కరీంనగర్ గడ్డ మీద నుంచి నేను సవాల్ విసురుతున్నా.
సమయం నువ్వే చెప్పు.. రావడానికి మేము రెడీ!ఇరిగేషన్, ఐటీ, సివిల్ సప్లైస్.. ఇలా ఏ సబ్జెక్ట్ మీదైనా సరే,
అర్థంపర్థం లేని విమర్శలు మానేసి… pic.twitter.com/nZcTgWUl6W— BRS Party (@BRSparty) May 7, 2026
Read Also :
Karimnagar | కరీంనగర్లో రెచ్చిపోయిన బీజీపీ గూండాలు..ఎమ్మెల్యే గంగుల ఆఫీస్‌పై దాడి : వీడియో
Agadha | షూటింగ్లో పాము కాటేసినా వనిత భయపడలేదు : ఎం.ఎస్. రాజు షాకింగ్ కామెంట్స్!
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

