Open school | ధర్మారం, జూలై18: ఓపెన్ స్కూల్లో పదవ తరగతి, ఇంటర్ చదవడానికి ఆసక్తి గలవారు దరఖాస్తులు చేసుకోవాలని ధర్మారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో చదవడానికి ఈ నెల 31 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ ధర్మారం మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ పాఠశాలను కేటాయించినట్లు ఆయన వివరించారు. బడి మధ్యలో మానేసిన వారు, 14 సంవత్సరాల వయసు నిండిన వారు, టెన్త్ ఫెయిల్ అయినవారు ఓపెన్ స్కూల్లో టెన్త్ చదవడానికి అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా 15 సంవత్సరాలు వయసు నిండిన వారు ఇంటర్ ఫెయిల్ అయిన వారు ఇంటర్ చదవడానికి అర్హులని ఆయన తెలిపారు. అన్ని వర్గాలవారు ఓపెన్ స్కూల్ చదువుకోవడానికి అవకాశం ఉందని, దీనిని ఆసక్తి గలవారు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో ప్రభాకర్, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ వడ్లూరి కిరణ్ కుమార్ కోరారు.