Arrest | మల్లాపూర్, ఆగస్టు 31: గ్రామాల్లో పనిచేస్తున్న ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి చేస్తారనే సమాచారంతో స్థానిక ఎస్సై రాజు ఆధ్వర్యంలో పోలీసులు మండల వ్యాప్తంగా పనిచేస్తున్న ఆశ కార్యకర్తలను ఆదివారం ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా ఆశ కార్యకర్తల సంఘం మండల అధ్యక్షురాలు శారద మాట్లాడుతూ ప్రతీ నెల తమకు వేతనం రూ.10 వేల తో పాటు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అరెస్టైన వారిలో శిరీష, సరిత, భూదేవి, ప్రేమలత, లావణ్య, స్వప్న, వసంత, లత, మమత, రాజేశ్వరీ, నవ్య, లిఖిత, తదితరులు పాల్గొన్నారు.