కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ టైని టాట్స్ హైసూల్లో ఆదివారం ‘మౌక్తికం’ పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు అలరించాయి. ఈ వేడుకలను పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.
ప్రతి ఒకరూ కళలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు వాటిలో పాల్గొనాలని, తద్వారా సమాజంలో సముచిత గుర్తింపు లభిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
– కమాన్చౌరస్తా, మార్చి 10