Vemulawada | వేములవాడ, ఏప్రిల్ 5: వేములవాడ రాజన్న ఆలయ ఇంచార్జ్ ఈవోగా అంజనా రెడ్డి కి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈవో రమాదేవి ఈనెల 19వ తేదీ వరకు 15 రోజులపాటు వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఈవోగా ఉన్న అంజనా రెడ్డికి వేములవాడ రాజన్న ఆలయం ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.