కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 19 : జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి విద్యావేత్త డాక్టర్ అమృతలత తమ సంస్థ ద్వారా 2023 సంవత్సరానికి సాహిత్య విమర్శ విభాగంలో కరీంనగర్‌కు చెందిన ప్రముఖ కవి విమర్శకులు దాస్యం సేనాధిపతిని రాష్ట్రస్థాయి అమృతలత జీవన సాఫల్య పురసారానికి ఎంపిక చేశారు. సాహితీ క్షేత్రంలో విమర్శ విభాగంలో సేనాధిపతి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఎంపిక చేసినట్లు అమృతలత పేర్కొన్నారు.
మార్చి 5న నిజామాబాద్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురసారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాహితీవేత్తలు డాక్టర్ నలిమెల భాసర్, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, పొన్నం రవిచంద్ర, బుర్ర మధుసూదన్ రెడ్డి, గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, వైరాగ్యం ప్రభాకర్, గాజోజు నాగభూషణం, వేణుశ్రీ, కలువకుంట రామకృష్ణ, కందుకూరు అంజయ్య, కూకట్ల తిరుపతి, తదితరులు సేనాధిపతికి అభినందనలు తెలిపారు.