Neeraj Chopra | ఈ సీజన్లో నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన.. అయినా రెండో స్థానంతోనే సరి..!
Neeraj Chopra: కామన్వెల్త్ క్రీడల్లో రజతంతో మెరిసిన నీరజ్ చోప్రా( Neeraj Chopra) ఆసియా క్రీడల ముందు మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ సీజన్లోనే అత్యుత్తమంగా 88.05 మీటర్ల దూరం ఈటెను విసిరాడు.
Neeraj Chopra: కామన్వెల్త్ క్రీడల్లో రజతంతో మెరిసిన నీరజ్ చోప్రా( Neeraj Chopra) ఆసియా క్రీడల ముందు మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ సీజన్లోనే అత్యుత్తమంగా 88.05 మీటర్ల దూరం ఈటెను విసిరిన భారత బడిసె వీరుడు లసానే డైమండ్ లీగ్లో విజేతగా నిలుస్తాడనిపించింది. కానీ, ఊహించినట్టుగానే శ్రీలంక స్టార్ రుమేశ్ థరంగ పథిరంగే నీరజ్ను దాటేసి టైటిల్ను ఎగరేసుకుపోయాడు. రెండో స్థానంలో నిలిచిన నీరజ్.. ఆసియా క్రీడలపై దృష్టి సారించనున్నాడు.
ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా వరసగా రెండో ఈవెంట్లోనూ రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో వెండి వెలుగులు విరజిమ్మిన అతడు.. లసానే డైమండ్ లీగ్లో మెరుగైన ప్రదర్శన చేసినా సరిపోలేదు. ఈ సీజన్లోనే అత్యుత్తమంగా నీరజ్ 88.05 మీటర్ల దూరం విసిరాడు. రెండో ప్రయత్నంలో ఈ మార్క్ అందుకున్న అతడికి శ్రీలంక అథ్లెట్ షాకిచ్చాడు.
NEERAJ CHOPRA FINISHED 2ND AT THE DIAMOND LEAGUE LAUSANNE! 💎
– Season Best throw of 88.05m 🔥🔥🔥 pic.twitter.com/iKbpOS2Li7
— The Khel India (@TheKhelIndia) August 21, 2026
కామన్వెల్త్లో పసిడి విజేత అయిన రుమేశ్ థరంగ పథిరంగే ఏకంగా 88.14 మీటర్ల దూరంతో ఇక్కడా మొదటి స్థానం సాధించాడు. దాంతో, భారత బడిసె వీరుడు టైటిల్ చేజార్చుకున్నాడు. 2022, 2023లో ఇక్కడ విజేతగా నిలిచిన నీరజ్.. 2024లో, ఈసారి కూడా రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

