Mallareddypalli | వీణవంక, జనవరి 9 : వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లిలో పెద్దమ్మతల్లి ఆలయం వద్ద అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి, తెలంగాణ ముదిరాజ్ జేఏసీ ఆధ్వర్యంలో నూతన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు శుక్రవారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పొల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్, రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు లింగాల పుష్పలత, ప్రధానకార్యదర్శి కొత్త నీరజ, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మయ్య, మత్స్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు మంద నాగేష్ ముదిరాజ్, అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ ముదిరాజ్ జేఏసీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గోనెల సమ్మన్న ముదిరాజ్, ప్రధానకార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.