వీణవంక, ఆగస్టు 3 : సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి చిన్ననాటి నుంచే చదువు లో ప్రతిభ కనబరుస్తున్న సరస్వతీ పుత్రికకు అమెరికాలో ఉచితంగా మాస్టర్స్ చేసే అవకాశం వచ్చింది. ప్రతిభావంతులను ప్రోత్సహించేందు కు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ నుంచి అమెరికాలో ఉన్నత విద్య (మాస్టర్స్) అభ్యసించడానికి నలుగురు విద్యార్థులను ఫెలోషిప్తో ఎంపిక చేయగా, అందులో కొండాలక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తిచేసిన వీణవంక మండలం మా మిడాలపల్లి గ్రామానికి చెందిన మూల పావని కూడా ఉన్నది.
ఆ యువతి ఇంటర్ చదివిన తర్వాత పోస్టల్శాఖలో ఉద్యోగానికి ఎంపికైనా వెళ్లకుండా ఎంసె ట్ రాసింది. హైదరాబాద్ కొండాలక్ష్మణ్ యూ నివర్సిటీలో బీఎస్సీ హార్టికల్చర్లో సీటు సాధించింది. 2023-2024లో ఉత్తమ ప్రతిభ కనబరిచి డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం అమెరికాలోని అబరాన్ యూనివర్సిటీలో మాస్టర్స్ కో సం దరఖాస్తు చేసుకొని సీటు సాధించింది.
మాస్టర్స్ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం హైదరాబాద్లో వెల్లడించారు. రెండేళ్లకు ప్రభుత్వం 55.50 లక్షలు ఖర్చు చేయనుండగా, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.