గంగాధర,సెప్టెంబర్ 17 : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన 2006- 07 10వ తరగతి పూర్వ విద్యార్థులు రూ. 16 వేల విలువైన కంప్యూటర్ను బహుమతిగా అందజేశారు. బుధవారం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్‌కు కంప్యూటర్ అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. భవిష్యత్తులో కూడా పాఠశాలకు, విద్యార్థులకు సహాయమందిస్తామన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ మాట్లాడుతూ విద్యార్థులు చేసిన మంచి పనిని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో కూడా మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేయాలని సూచించారు. కంప్యూటర్ అందజేసిన పూర్వ విద్యార్థులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో నగేష్, విజయ్ కుమార్, లక్ష్మీరాజం, జగదీశ్వర్ రెడ్డి, భూమయ్య, మంజుల, రాయ మల్లయ్య, రాజబాబు, మల్లేశం, సత్యనారాయణ, శ్రీధర్, పూర్వ విద్యార్థులు రాజు, నరేష్, రాజశేఖర్, మల్లికార్జున్, ఉదయ్, కమల్, మధు తదితరులు పాల్గొన్నారు.