విద్యానగర్, నవంబర్ 14 : కరీంనగర్ డీసీసీబీ 2023-24 సంవత్సరం పనితీరుకు నాఫ్స్కాబ్ అఖిల భారత మొదటి ఉత్తమ డీసీసీబీ అవార్డును అందుకున్నదని కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు తెలిపారు. కరీంనగర్‌లోని 71వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా గురువారం డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో కో ఆపరేటివ్ జెండాను ఆయన ఎగురవేసి, వేడుకలను ప్రారంభించారు. కేంద్ర సహకార మంత్రిత్వశాఖ చేపట్టిన అనేక కార్యక్రమాల్లో కేడీసీసీబీ పీఏసీఎస్‌లు అనేక కార్యక్రమాలు చేయడంలో ముందున్నాయన్నారు. సీఈవో సత్యనారాయణరావు మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరానికి ఆల్‌రౌండ్ పని తీరుకు ఈ అవార్డు పొందిందన్నారు. ప్రొఫెషనల్ డైరెక్టర్ గోపాల్ మాట్లాడుతూ వినియోగదారుల విశ్వాసాన్ని సహకరించడంలో నిజాయితీ చాలా ముఖ్యమని, కష్టపడి చేయడం వల్ల బ్యాంకు పురోగతితో పాటు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పింగలి రమేశ్, డైరెక్టర్ రాంచంద్రారావు, మందాడి సాగర్, అలువాల్ కోటయ్య, భూపతి, సురేందర్, ఎల్లంకి రమేశ్, డీసీవో రామానునాచార్య, డీఆర్వో ఎస్డీ రాంమోహన్, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.