టీఆర్ఎస్ సర్కారు పాలనలోనే సంక్షేమం
సీఎం కేసీఆర్ కృషితో పల్లెల సర్వతోముఖాభివృద్ధి
ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి
రెడ్డిపల్లిలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
వీణవంక, జూన్ 6: రాష్ట్రంలో టీఆర్ఎస్తోనే అభివృద్ధి.. సంక్షేమం జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నదని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. గుడి లేని ఊరు ఉండది.. అన్నట్లుగా ఈ రోజు పథకాలందని గ్రామం లేదని చెప్పారు. సోమవారం రెడ్డిపల్లిలో 16లక్షలతో నిర్మించిన జీపీ భవనం, 21లక్షలతో వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డును స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించి, ఆయన మాట్లాడారు. సంక్షేమంలో ఇవ్వాళ తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ సర్కారు పంచాయతీలకు ఒక్క పైసా బాకీ లేదని, ఒకవేళ నిరూపిస్తే ముక్కు భూమికి రాస్తానని బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే స్పందించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ సర్కారు గ్రామాలకు నిధులు ఇవ్వకుంటే ఎమ్మెల్యే, ఎంపీని గ్రామాల్లో తిరుగనివ్వబోమని స్పష్టం చేశారు. ఇక్కడ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాదవరెడ్డి, సర్పంచ్‌లు పోతుల నర్సయ్య, సునీత-మల్లారెడ్డి, ఎంపీటీసీలు ఒడ్డెపెల్లి లక్ష్మీ-భూమయ్య, నాగిడి సంజీవరెడ్డి, తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ శ్రీనివాస్, టీఆర్ఎస్ సోషల్‌మీడియా కన్వీనర్ పాకాల గోవిందరెడ్డి, వార్డు సభ్యులు , పీఏసీఎస్ డైరెక్టర్ చెక్కబండి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇట్టవేని రాజయ్య, వికలాంగుల మండలాధ్యక్షుడు పైడిమల్ల శ్రీనివాస్, నాయకులు పోతుల సురేశ్, చింతల రాజు, సుమన్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఘన్ముక్లకు ఆర్టీసీ బస్సు
ఈ నెల 3న ఘన్ముక్లకు ఎమ్మెల్సీ రాగా, ఆర్టీసీ బస్సు లేక ఇబ్బందవుతున్నదని గ్రామస్తులు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్సీ అధికారులతో మాట్లాడి బస్సు వేయించారు. సోమవారం గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించి, వారితో కలిసి బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలియజేశారు.