కమాన్‌చౌరస్తా, జూన్ 5: నీట్-2024 ఫలితాల్లో అల్ఫోర్స్ జయకేతనం ఎగరేసింది. ఉత్తమ మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరీంనగర్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ కోచింగ్‌లో డాక్టర్స్ -30 ప్రత్యేక ప్రోగ్రామ్ ద్వారా కోచింగ్ అందించిన రెండో సంవత్సరంలోనే అల్ఫోర్స్ విజయపరంపర కొనసాగిందన్నారు. 10 మంది విద్యార్థులు 600, ఆపై మారులు, 20 మంది విద్యార్థులు 560 ఆపై మారులు, 41 మంది విద్యార్థులు 500 పై మారులు, 86 మంది విద్యార్థులు 450 పై మారులు సాధించడం సంతోషంగా ఉందన్నారు.
ఇందులో ఎన్ హేమంత్ 691 మారులు సాధించగా, వీ హాసిని 671, డీ పూజిత 650, ఎన్ కౌశిక్ రెడ్డి 647, పీ అక్షర రెడ్డి 639, వీ శ్రీముఖి 619, మరియాసభ 619, ఏ శ్రీవర్థిని 613, ఎం కమాలికాప్రీతి 613, ఎన్ జ్ఞానద 604, ఏ అమరేందర్ 598, బీ హాసిత 595, కే శ్రీవిద్య 582, ఎండీ అఫ్ఘాన్ ఖాన్ 579, ఎన్ సాయిప్రతిజ్ఞ 573, ఎం ప్రతిమ 571, పీ శ్రీనాథ్ 566, షేక్ ఉమ్రా 561, తేజస్వీని 560, మహీన్ నజ్మీన్ 560 మారులు సాధించారు. కే సుహృదాఘవ పీడబ్ల్యూడీ కేటగిరిలో జాతీయస్థాయిలో 675వ ర్యాంకు సాధించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో అత్యధిక మంది విద్యార్థులను మెడికల్, ఐఐటీ, ఎన్ఐటీలలో సీట్లు సాధించేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.