కరీంనగర్ కమాన్చౌరస్తా, జూన్ 1 : ఐఐటీ అడ్వాన్స్డ్-2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కే ప్రజ్ఞాన్ దీపక్ 75వ ర్యాంకు సాధించగా, సీహెచ్ లక్ష్మీహాసిని 400, ఎన్ రత్నప్రకాశ్ 497, బీ లిఖిత్ సాయి 785, ఎమ్ వశిష్ఠ 800, బీ స్పందన 954, కే ధనుష్ 1294, ఎమ్ జోహన్ 1400, పటేల్ అక్షయ 1488, సీహెచ్ అభిరామ్ రావు 1618, ఏ సత్యవర్ధన్ 1678 ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని మరింత పెంచారని చెప్పారు.
వెయ్యిలోలోపు ఆరుగురు విద్యార్థులు, 2వేలలోపు 11 మంది, 3వేల లోపు 19 మంది విద్యార్థులు ర్యాంకు లు కైవసం చేసుకోవడం గొప్ప విషయమ న్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషే ఇంతటి ఘనవిజయా నికి తోడ్పడ్డాయన్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రప్రథమంగా ఐఐటీ కోచింగ్ అందించి, అనేక మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక ఐఐటీలలో సీట్లు సాధించేలా తీర్చిదిద్దిన ఏకైక విద్యాసంస్థ అల్ఫోర్స్ అని స్పష్టం చేశారు. రాబోయే నీట్-2026 ఫలితాల్లో కూడా తమ విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.