గంగాధర, ఫిబ్రవరి 7 : మండలంలోని ఆగ్రోస్ రైతుసేవా కేంద్రం, డీసీఎంఎస్, కురిక్యాల పీఏసీఎస్ కేంద్రాల్లో బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి ప్రియదర్శిని తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో స్టాక్ రిజిస్ట్రర్లు, బిల్ బుక్కులను పరిశీలించారు.
రైతులు ఎరువులు కొనుగోలు చేసిన సమయంలో విధిగా బిల్లులు ఇవ్వాలని, దుకాణాల ఎదుట ధరల పట్టిక ఏర్పాటు చేయాలని దుకాణాల నిర్వాహకులకు సూచించారు. ఇక్కడ ఏడీఏలు అంజని, రామారావు, ఏవో రాజు, ఏఈవోలు ఉన్నారు.