కరీంనగర్ విద్యానగర్, జూలై 29 : పైల్స్, ఫిషర్ ఫిస్టులా వంటి జబ్బులతో బాధపడుతున్న రోగులు నాటు వైద్యాన్ని నమ్మి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని ప్రముఖ ల్యాప్రోసోపిక్ అండ్ లేజర్ డాక్టర్ చిట్టుమల్ల ప్రదీప్ కుమార్ సూచించారు. ఫైల్స్, ఫిషర్ ఫిస్టులా జబ్బులకు అత్యాధునిక లేజర్ స్టాఫ్లర్ వంటి ఇన్వాసిస్ పద్ధతుల ద్వారా నొప్పి లేకుండా ఆపరేషన్ చేసి, ఒక రోజులోనే డిశ్చార్జ్ చేయవచ్చని చెప్పారు. రెండు రోజులుగా నగరంలోని మైత్రి కన్వెన్షన్లో జరుగుతున్న సౌతిండియా రీజనల్ కొలొరెక్టల్ కాన్ఫరెన్స్-2024లో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా దేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖ కొలొరెక్టల్ నిపుణులు వివిధ అంశాల గురించి వివరించారు. వివిధ శస్త్ర చికిత్సలు చేయడం నేర్పించారు అలాగే, లైఫ్ లైన్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ నుంచి వివిధ రకాల ఆపరేషన్లను ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 100 మంది సీనియర్ కొలొరెక్టల్ నిపుణులు, 400 మంది సర్జన్లు, ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ రవీందర్రావు, సెక్రటరీ డాక్టర్ చిట్టుమల్ల ప్రదీప్ కుమార్, కోశాధికారి డాక్టర్ అరుణ్ కఠారి, ఐఎస్సీపీ కార్యదర్శి డాక్టర్ లడ్డుకర్, కోశాధికారి డాక్టర్ శాంతి వర్ధిని, డాక్టర్ గంగ శంకర్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ప్రశాంత్, చల్మెడ వైద్య కళాశాల డైరెక్టర్ వీ సూర్యనారాయణరెడ్డి, టీజీఎంసీ సభ్యులు డాక్టర్ రాజకుమార్, డాక్టర్ నరేశ్ పాల్గొన్నారు.