MLC Malka Komuraiah | సుల్తానాబాద్ రూరల్ మే 23: ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లను పెంచే దిశగా కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్లో శుక్రవారం ఆంగ్లం, ప్రధానోపాధ్యాయులు, ఎస్జీటీ ఉపాధ్యాయుల రెండో విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు జరిగిన శిక్షణా కార్యక్రమానికి మల్క కొమరయ్య హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి, నాణ్యమైన విద్యను అందించే ప్రణాళికలు తయారు చేసుకొని సూచించారు.
శిక్షణా తరగతులను సద్వినియోగo చేసుకోవాలన్నారు. ఈ నాటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలనీ, ఉపాధ్యాయులు బాధ్యతగా మెలగాలని పేర్కొన్నారు. శిక్షణా తరగతులను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కోర్సు డైరెక్టర్, ఎంఈవో ఆరెపల్లి రాజయ్య , ప్రోగ్రాం అబ్జర్వర్ సీహెచ్ ప్రద్యుమ్న కుమార్ కొమురయ్యని శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ లు జి .జగదీశ్వర్, కె.శ్రీనివాస్, జె.శ్రీనివాస్, డి.నాగరాజు , డి. శ్రీనివాస రావు, కె. అనిల్, మునికుమార్, తిరుపతి రెడ్డి, రమేష్, కిషన్, సుధాకర్ రావు, వాని, సిఆర్.పి. సదానందం, సి.సి.ఓ. రజియా సుల్తానా, అంతర్గాం, జూలపల్లి, సుల్తానాబాద్, రామగిరి, మంథని, ఎలిగేడు, కమాన్పూర్, ధర్మారం మండలాల ఆంగ్లం ఉపాద్యాయులు , ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు, సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.