Vemulawada | వేములవాడ, ఆగస్టు 21 : తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించడమే కాకుండా తనపై అకారణంగా చేయి చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఈనెల 19న రెడ్డి భవన్ లో ఈశ్వర్ సాయి సతీమణి శరణ్య తనను అకారణంగా అసభ్యకరమైన భాషతో దూషించడమే కాకుండా దాడి కూడా చేశారని ఫిర్యాదులో పేర్కొంది.
వీడియోలను రికార్డ్ చేయడమే కాకుండా తన విలువైన రూ.50 వేల ఐఫోన్ దొంగలించారని ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఆ వీడియోలను సామాజిక మాధ్యమాలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్, థ్రెడ్స్ వంటి ద్వారా ఆమె తప్పుగా చూపుతూ భంగం వాటిల్లే విధంగా ప్రచారం చేసిందని పేర్కొంది. దీంతో పాటు పలు మీడియా సంస్థలు కూడా తన వ్యక్తిగత గౌరవాన్ని కించపరచడమే కాకుండా పరువుకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరించారాని వేములవాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశ్వర్ సాయి సతీమణి శరణ్యపై కేసు నమోదు చేయడమే కాకుండా మీడియా సంస్థలపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వీరప్రసాద్ తెలిపారు.