ABVP | ధర్మారం, అక్టోబర్ 23 : పెద్దపల్లి జిల్లా ధర్మారం నగర శాఖ ఏబీవీపీ నూతన కార్యవర్గాన్ని ఆ శాఖ అనుబంధ స్టూడెంట్ ఫర్ సేవ (ఎస్ఎఫ్ఎస్ )రాష్ట్ర కో కన్వీనర్ ఓమేష్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం ధర్మారం మండల కేంద్రంలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సమావేశానికి ఆయన హాజరై నూతన కార్యవర్గాన్ని వెల్లడించారు.
ధర్మారం నూతన నగర కార్యదర్శిగా ఆకుల వంశీ, ఉపాధ్యక్షులుగా ఎం రఘు , వివేక్, కె సందీప్, జి.శవన్య , సంయుక్త కార్యదర్శులుగా బి.అవినాష్, బి.మనోజ్, కె.సిద్ధార్థ, బి.శివర్ధన్, సోషల్ మీడియా ఇన్చార్జిగా టి. రవికుమార్, కార్యవర్గ సభ్యులుగా ఎం.రష్మిత, డి.హరీష్, ఎం.రిషిత్, పి.రాజేందర్, పి.సాయి చరణ్, ఐ.శ్రవణ్, ఎస్ఎఫ్ డి కన్వీనర్ గా అక్షిత, ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్ గా జె.రాకేష్ ను నియమించినట్లు ఆయన వివరించారు.