Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 7 : గోదావరిఖని నగరంలోని విఠల్ నగర్ లో గల ఐసీడీఎస్ కార్యాలయంలో బుధవారం నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ నమోదు ప్రత్యేక శిబిరం ప్రారంభమైంది. జిల్లాలో ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ నమోదు సులభతరం చేసేందుకు గానూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు బుధ, గురువారాలు రెండు రోజుల పాటు ఆధార్ నమోదు ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఇందులో భాగంగా మొదటి రోజు విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
చిన్నారుల తల్లిదండ్రులు, సంరక్షకులు శిబిరంకు హాజరై ఆధార్ నమోదు సేవలను వినియోగించుకున్నారు. కాగా ఈ శిబిరాన్ని గురువారం సైతం ప్రత్యేక శిబిరం కొనసాగుతుందని తెలిపారు. రామగుండం పరిధిలోని అర్హులైన చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లల ఆధార్ నమోదు చేయించాలని తెలిపారు. భవిష్యత్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఇతర అవసరాలకు ఆధార్ సేవలు అందుబాటులో ఉండేలా ఈ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.