గంగాధర, డిసెంబర్ 9: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన త్రి దళాధిపతి బిపిన్ రావత్ దంపతులు, 11 మంది జవాన్ల స్మత్యర్థం కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. గురువారం మధురానగర్ చౌరస్తాలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ పార్టీ మండలాధ్యక్షుడు పురుమల్ల మనోహర్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్, వీరేశం, గంగన్న, స్వామి, లక్ష్మీనారాయణ, కరుణాకర్, శ్రీనివాస్, నాగేందర్‌రెడ్డి, నర్సయ్య, శ్రీధర్, రమణారెడ్డి, తిరుపతిగౌడ్ పాల్గొన్నారు. అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మధురానగర్ చౌరస్తాలో రావత్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక్కడ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కొ లిపాక స్వామి, డీకేడీఎంఎస్ఎస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్, నాయకులు లింగాల దుర్గయ్య, మ్యాక వినోద్ తదితరులు పాల్గొన్నారు.
కొవ్వొత్తులతో నివాళి..
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్, త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ చిత్రపటానికి పట్టణంలో ఏబీవీపీ నాయకులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణంతో దిగ్భ్రాంతికి లోనయ్యామని చెప్పారు. ఆయన ఆర్మీ ఆఫీసర్‌గా దేశానికి అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. కార్యక్రమంలో కళాశాల ఏబీవీపీ విభాగం అధ్యక్షుడు వరుణ్, కార్యదర్శి అపర్ణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.