Magic Festival | కోల్ సిటీ , ఏప్రిల్ 27: గోదావరిఖనికి చెందిన ప్రముఖ మెజీషియన్, బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజాకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడులో జరుగుతున్న మేజిక్ ఫెస్టివల్ – 2025కు ముఖ్యతిథిగా ఆహ్వానం లభించింది. రాజాతోపాటు మేజిక్ హరి, హాస్య కళాసారధి చంద్రపాల్ ను కూడా ఆహ్వానించగా, ఆదివారం పల్నాడుకు బయలుదేరి వెళ్లారు.
అక్కడ అట్టహాసంగా జరుగుతున్న మేజిక్ ఫెస్టివల్లో ముఖ్యతిథిగా మేజిక్ రాజా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గోదావరిఖని ప్రాంత కీర్తిని మరింతగా ఇనుమడింపచేశారు. రాజా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నర్సారావుపేటలో జరుగుతున్న ఈ మేజిక్ ఫెస్టివల్ కు తనకు ముఖ్యతిథిగా ఆహ్వానం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఫెస్టివల్లో డీలర్ డెమోలు, లెక్చర్ కమ్ డెమోనిస్ట్రేషన్, జూనియర్, సీనియర్ మెజీషియన్స్ కాంపిటేషన్, స్ట్రీట్ మేజిక్, గాలా షో. డీలర్స్ స్టాల్స్ ప్రదర్శనలు అబ్బురపరిచాయని పేర్కొన్నారు.