Dharmaram | ధర్మారం, సెప్టెంబర్ 20: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున స్థానికులు కొండచిలువను చంపి వేశారు. మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపాన ఉన్న వంతెన వెనుక కొంతమంది తాత్కాలిక గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారు.
సమీప ప్రాంతం నుంచి శనివారం తెల్లవారుజామున కొండ చిలువ గుడిసెల ప్రాంతానికి వచ్చి కోళ్ల గూటిలోకి ప్రవేశించి ఓ కోడిని మింగేసింది. మిగతా కోళ్లు అరుస్తుండగా మెలకువ వచ్చిన వారు చూడగా అందులో కొండచిలువ కనిపించింది. దీంతో వారు దానిని చితక బాధడంతో నోట్లో ఉన్న మరణించిన కోడిని వదిలేసింది. దీంతో అట్టి కొండచిలువను పూర్తిగా చంపేసి దూరంగా పారేశారు.