Sultanabad | సుల్తానాబాద్ రూరల్, మే 25: పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2004 -05 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు రామ్ కిషన్ రావు, శ్రీనివాస్, జగత్ పాల్, భరత్ కుమార్ ,చంద్రమౌళి ,లక్ష్మణ్, నారాయణ, జ్యోతి లను సమ్మేళన కార్యక్రమానికి పిలిపించుకొని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి సత్కరించారు.
పూర్వ విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సాగర్ రావు, మహేందర్, విద్యాసాగర్, రాజు, ప్రవీణ్, మంజుల, కస్తూరి, సంధ్య, స్రవంతి తోపాటు పలువురు పాల్గొన్నారు.