Mathuranagar | గంగాధర, ఏప్రిల్ 13 : గంగాధర మండలం మధురానగర్ సురభి పాఠశాల 2012-13 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన గురువులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. సాయంత్రం వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిప్ప వీరేశం మాట్లాడుతూ ఆనాటి విద్యార్థులు నేడు ప్రయోజకులుగా తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు. 12 ఏళ్ల తర్వాత చదువుకు చెప్పిన గురువులను గుర్తుంచుకొని మరి పాఠశాలకు వచ్చి సన్మానించడం గొప్ప విషయం అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత గొప్ప వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చిప్ప వీర నర్సయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్, సంతోష్ కుమార్, రమేష్, రాములు, ఉమ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.