Veenavanka | వీణవంక, జనవరి 31: వీణవంక ఎంపీడీవో మేరుగు శ్రీధర్ పదవీ విరమణ పొందగా ఎంపీడీవో కార్యాలయ అధికారులు, జిల్లా అధికారులు శనివారం ఘనంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఫంక్షన్ హాల్లో ప్రత్యేక సమవేశం నిర్వహించి శ్రీధర్ దంపతులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, ఆర్డీవో మహేశ్వర్ హాజరయ్యారు. తహసీల్దార్ రాజమల్లు, ఎంఈఓ శోభారాణి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజిరెడ్డి, హైస్కూల్ హెడ్మాస్టర్ అశోక్ రెడ్డి, కేజీబీవీ ఎస్వో సునీత, వెటర్నరీ డాక్టర్ శ్రీకాంత్, వివిధ మండలాల అధికారులు, బంధువులు, కుటుంబ సభ్యులు, ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది, తహసీల్దార్ ఆఫీస్ సిబ్బంది, అధికారులు, జీపీ కార్యదర్శులు, సర్పంచులు, మండల ప్రజా ప్రతినిధులు, అభిమానులు జ్ఞాపికలను అందజేస్తూ, పూలమాల వేస్తూ, ఎంపీడీవో దంపతులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.