Nayanthara with Salman Khan | ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరో భారీ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి కథానాయికగా పరిచయం చేశారు మేకర్స్. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కథానాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతారను ఎంపిక చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణ సంస్థకు ఇది 63వ చిత్రం (SVC63) కావడం విశేషం.
ఈ అప్డేట్ను వెల్లడిస్తూ.. SVC63 ప్రాజెక్ట్‌లోకి ది క్వీన్ అడుగుపెట్టింది.. ఎంతో ప్రత్యేకంగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లోకి నయనతారను ఆహ్వానించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని చిత్ర బృందం రాసుకోచ్చింది. నయనతార ఇప్పటికే షారుఖ్ ఖాన్ సరసన ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టి రికార్డు స్థాయి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ అగ్ర హీరో అయిన సల్మాన్ ఖాన్‌తో ఆమె జతకట్టడం భారతీయ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ముగ్గురు దిగ్గజాలైన సల్మాన్ ఖాన్, నయనతార మరియు వంశీ పైడిపల్లి కలయికలో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. దర్శకుడు వంశీ పైడిపల్లి గతంలో దళపతి విజయ్ సరసన ‘వారసుడు’ (వారిసు) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌ను ఆయన ఎలాంటి సరికొత్త కథతో చూపించబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.
The Queen Arrives 🔥
The epitome of versatility and excellence #NAYANTHARA joins #SalmanKhanVamshiPaidipallyFilm 💥💥
It’s an honour to have You on board for something truly special that’s underway 🙏🏻#SVC63 @BeingSalmanKhan @directorvamshi #DilRaju #Shirish @SVC_official… pic.twitter.com/sRtMdUBsBI
— Sri Venkateswara Creations (@SVC_official) March 31, 2026