Dhurandhar 2: దావూద్ ఇబ్రహీం వైట్‌హౌజ్‌ను చూశారా? ధురంధర్ మూవీలో ఆ సీన్ ఓ హైలెట్
Dhurandhar 2: కరాచీలోని 13 క్లిఫ్టన్ రోడ్డులో దావూద్ ఇబ్రహీం వైట్‌హౌజ్ ఉంది. ఆ డాన్ ఇంటిని మీరెప్పుడైనా చూశారా. ధురంధర్ రివేంజ్ మూవీలో డైరెక్టర్ ఆదిత్య ధార్ ఆ ఇంటిని అత్యద్భుతంగా చూపించాడు. ఆ థ్రిల్లింగ్ సీన్.. మూవీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
ముంబై: ధురంధర్ 2(Dhurandhar 2 ) ఫిల్మ్ ప్రస్తుతం బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోని రికార్డులన్నీ ఇప్పటికే బ్రేక్ చేసింది. ఆ స్పై థ్రిల్లర్ మూవీని తీసేందుకు డైరెక్టర్ ఆదిత్య ధార్ చాలా రిస్క్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి సీన్‌ను అత్యద్భుతంగా చిత్రీకరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. అయితే ధురంధర్-2 ఫిల్మ్‌లో.. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం ఇంటిని చూపించిన తీరు ఓ హైలెట్. కరాచీలో దావూద్ ఉన్నట్లు ఆ ఫిల్మ్‌లో ప్రజెంట్ చేశారు. హీరో పాత్ర పోషించిన రణ్వీర్.. హమ్జా అలీ పాత్రలో ఓ సందర్భంలో ఆ ఇంటికి వెళ్తారు. దావూద్ ఇబ్రహీంను పరిచయం చేసే సీన్‌ను.. డైరెక్టర్ చాలా స్టయిల్‌గా ప్రజెంట్ చేశారు. వైట్‌హౌజ్ 13, క్లిఫ్టన్ అన్న అడ్రస్‌తో ఆ ఇంటిని చూపించాడు. కెమెరా మ్యాజిక్‌తో ఆ ఇంటి అందాన్ని చూపించిన వైనం అనిర్వచనీయం. బాడే సాబ్ దావూద్‌ను కలిసేందుకు వెళ్దామని మేజర్ ఇక్బాల్.. హీరో హమ్జాతో చెప్తాడు. ఇక ఆ సీన్ మొదలుకుని, వైట్‌హౌజ్ ఇంటికి వెళ్లే వరకు ఉన్న ప్రతి ఫ్రేమ్ అద్భుతమే అని చెప్పాల్సి వస్తుంది. కరాచీలోని లయరీ ప్రాంతంలో హమ్జా ఫేమస్ అయ్యాడని, అతన్ని దావూద్‌కు పరిచయం చేసేందుకు బడే సాహబ్ ఇంటికి తీసుకెళ్లారు. లయరీ స్లమ్ ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఇంటిని చూపించిన తీరు సినీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
హమ్జా వెళ్తున్న కారు బడే సాహెబ్ దావూద్ ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఆ సీన్‌ను సూపర్‌గా చూపించాడు డైరెక్టర్. దావూద్ ఇబ్రహీం నిషిధ్ద ఇంటిని ఓ లాంగ్ షాట్ ద్వారా కళాత్మకంగా తెరకెక్కించాడు. వాస్తవానికి దావూద్ ఇంటి గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. కానీ ఈ ఫిల్మ్‌లో డైరెక్టర్ ఆదిత్య ధార్ ఆ ఇంటిని చూపేందుకు చేసిన ప్రయత్నం అసాధారణమే. రెడ్ బ్లాక్ లెటర్స్‌తో తెలుపు రంగు ప్రహరి గోడపై దావూద్ ఇంటి అడ్రస్ రాసి ఉంటుంది. భారీ సైజులో ఉన్న తెలుపు రంగు ఇంటిని చూపించారు. ఆ ఇంటికి పెద్ద సైజులో గోల్డెన్ డాలర్ గుర్తులు ఉన్నాయి. ఆయుధాలతో ఆర్మ్డ్ గార్డ్స్ గేటు వద్ద రక్షణగా ఉన్నారు. ఇక ఎంట్రీ గేటు పిల్లర్లపై రెండు భారీ సైజు డేగలను కూడా ఆకర్షణీయంగా చూపించారు. ప్రధాన పాత్రధారుడు హమ్జా్ ఆ ఇంట్లోకి ప్రవేశించే సన్నివేశాన్ని కూడా క్లాసికల్‌గా ప్రజెంట్ చేశారు. ఇంట్లోకి ప్రవేశించగానే ఓ విదేశీ వ్యక్తి .. సెక్యూర్టీ చెక్ చేస్తారు. వెపన్‌ను అతనికి ఇచ్చి మెటల్ డిటెక్టర్ ద్వారా హమ్జా లోపలికి ప్రవేశిస్తాడు.
బడే సాహెబ్‌ను కలిసేందుకు కొంత సేపు హమ్జా వెయిట్ చేస్తాడు. ఆ టైంలో హీరో ఆ ఇంటిని స్కాన్ చేస్తాడు. ఆ సీన్‌ను కూడా అద్భుతంగా చూపించాడు. చాలా గ్రాండ్‌గా ఉన్న ఆ ఇంటిని చూసి హమ్జా స్టన్ అవుతాడు. శాండ్లియర్లు, విశాలమైన మెట్లు, అతిపెద్ద డైనింగ్ టేబుల్.. అన్నీ విలాసవంతంగా దర్శనమిస్తాయి. ఇంటి నిండా చాలా వరకు సింహం పెయింటింగ్‌లు ఉన్నట్లు చూపించారు. అధికారానికి చిహ్నంగా ఆ బొమ్మలు ఉన్నట్లు తెరకెక్కించారు. ఇక దావూద్ ఇబ్రహీం మాస్టర్ బెడ్రూమ్ కూడా ఓ హైలెట్. ఓ బెడ్‌పై చికిత్స పొందుతున్నట్లు దావూద్ పడుకుని మాట్లాడుతుండగా, అతని మీద గోడపై ఓ పెయింటింగ్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 70 ఏళ్ల దావూద్ ఇబ్రహీం బెడ్రూమ్లో చాలా పెద్ద సైజు బెడ్‌పై ఉన్నట్లు చూపించారు. కర్టేన్లు, విండో షడ్స్ అన్నీ సూపర్ రిచ్‌గా ఉంటాయి. ఇక ఐసీయూ సెటప్ కూడా మరో లెవల్‌గా ఉంటుంది. దావూద్ ఇబ్రహీం ఎంత లగ్జరీ జీవితాన్ని గడిపారో చూపించేందుకు ఆ సీన్ క్రియేట్ చేసినట్లు ఆదిత్య ధార్ చెప్పారు.
కరాచీలోని సౌదీ మసీదు వద్ద వైట్‌హౌజ్ 13, క్లిఫ్టన్ ఉన్నది. క్లిఫ్టన్ బీచ్‌కు సుమారు 6 నిమిషాల డ్రైవ్ దూరంలో ఆ భవనం ఉంది. కరాచీలో అత్యంత సంపన్నవర్గాలు ఉండేది క్లిఫ్టన్ ప్రాంతం. ఆ సిటీలో అదే ఖరీదైన రియల్ ఎస్టేట్ ఏరియా. అక్కడే అనేక విదేశీ కాన్సులేట్లు ఉన్నాయి. విదేశీ లగ్జరీ బ్రాండ్లకు చెందిన అనేక షాపులు ఆ ప్రాంతంలో ఉంటాయి. ముంబై సీరియల్ పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీం తన సోదరుడు అనీస్ ఇబ్రహీంతో కలిసి కరాచీలోని విల్లాలో ఉంటున్నట్లు గతంలో ఓ బ్రిటీష్ పత్రిక రాసింది. కరాచీలోని కయ్యూమాబాద్లో ఉన్న స్ట్రీట్ నెంబర్ 30, ఫేస్ 5, సెక్టార్ బీలో ఆ విల్లాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న చైనీస్ కాన్సులేట్‌కు 700 మీటర్ల దూరంలో ఆ రెండు విల్లాలు ఉన్నట్లు చెబుతున్నారు. 1992లో జరిగిన ముంబై పేలుళ్ల తర్వాత పరారీ అయిన దావూద్ ఇబ్రహీం అప్పటి నుంచి కరాచీలోని కయ్యూమాబాద్లోనే నివసిస్తున్నట్లు తెలుస్తోంది.
In Dhurandhar, Dawood Ibrahim ‘s address is depicted as 13, Clifton, White House, Karachi.
In January 2024, i revealed his real address. Infact, i called one of the family members, who confirmed that Dawood would be back home in the evening. pic.twitter.com/lZgyCB5ZXK
— Abhinandan Mishra (@mishra_abhi) March 30, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

