sulthanabad | సుల్తానాబాద్ రూరల్, ఫిబ్రవరి21 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాల లో శనివారం ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 70 రకాల వంటకాలను విద్యార్థులు ఇంటిదగ్గర తయారు చేసి తీసుకువచ్చి ప్రదర్శించారు.
సేమియా ఉక్మా, పూరి, ఉక్మా, గులాబ్ జామ్, పునుగులు, నువ్వుల లడ్డు, సిరా, ఆలూ బజ్జీ, సొరకాయ గారెలు, పరమాన్నం,అటుకులు, పాప్ కార్న్, కంద గడ్డ, పల్లీ పట్టీలు, బూరెలు, టమాటా రైస్, శనగలు, పుట్నాల లడ్డూ, చపాతీ, మిర్చి బజ్జీ, బీట్ రూట్ హల్వా, బొంది లడ్డూ, డాబాల్కా మీట, పాయసం, పులిహోర, మక్క గారెలు, డ్రై ఫ్రూట్ లడ్డూ, గుడాలు, బెల్లన్నం, మినుప వడలు, బొండా, సగ్గు బియ్యం పాయసం, పకోడీ, స్వీట్ కార్న్, బాదుషా, చేగోడీలు, ప్యాలాల లడ్డు, పాలక్ పకోడీ తదితర సంప్రదాయ వంటకాలను విద్యార్థులు తీసుకువచ్చి ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దీకొండ భూమేష్ కుమార్ హాజరై మాట్లాడారు.
ఈ ప్రపంచంలో ఏ జీవి కూడా ఆహారం తీసుకోకుండా జీవించలేదని అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అని మన పెద్దలు చెబుతారని గుర్తు చేశారు. జంక్ ఫుడ్ వల్ల వచ్చే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ బృందాని అభినందించారు. అంతకు ముందు తల్లిదండ్రుల మీటింగ్ నిర్వహించారు. సర్పంచ్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సర్పంచ్ దంపతులు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దాసరి మధుసూదన్ రెడ్డి , హెచ్ఎం రజని, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ దండవేణి స్వప్న, ఉపాధ్యాయులు డీ రవీందర్, ఎన్ శ్రీలత, ఎం వెంకటస్వామి, టీ తిరుపతి రావు, అంగన్వాడీ టీచర్లు డీ శ్రీలత, ఉపాధ్యాయురాలు కే అనూష తదితరులు పాల్గొన్నారు.