Heart Attack | అయ్యప్ప మాల ధరించేందుకు వెళ్లి అనంతలోకాలకు.. గుండెపోటుతో మాలధారుడు మృతి
అయ్యప్ప మాలధారణ చేపట్టేందుకు సిద్ధమైన ఓ భక్తుడు గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. మరికాసేపట్లో అయ్యప్ప మాల ధరించాల్సి ఉండగా మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.
- మరికాసేపట్లో మాల వేసుకోవాల్సి ఉండగా విషాదం
- వీర్నపల్లిలో విషాదఛాయలు
Heart Attack | వీర్నపల్లి, నవంబర్ 20 : అయ్యప్ప మాలధారణ చేపట్టేందుకు సిద్ధమైన ఓ భక్తుడు గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. మరికాసేపట్లో అయ్యప్ప మాల ధరించాల్సి ఉండగా మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. వీర్నపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు దాసారం లింబాద్రి (38) శుక్రవారం పలువురు గ్రామస్తులతో కలిసి అయ్యప్ప మాల ధరించేందుకు సిరిసిల్లకు వెళ్లాడు.
అక్కడ అయ్యప్ప పూజ కార్యక్రమం ముగిసిన అనంతరం మూత్ర విసర్జనకు వెళ్లిన లింబాద్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి వారు వెంటనే ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టేందుకు ఎంతో ఆశతో వెళ్లిన లింబాద్రి ఇలా ఆకస్మికంగా మృతి చెందడంతో వీర్నపల్లిలో విషాదం అలుముకుంది. మృతుడు కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. లింబాద్రి మృతి పట్ల వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇబ్బందులు ఎదురైతే భయపడకుండా తెలుపాలి’
Samantha Ruth Prabhu | తల్లిదండ్రులైన సమంత – రాజ్ నిడిమోరు.. కొడుకుకు ‘దేవ్ నిడిమోరు’ అని నామకరణం!
Harish Rao | రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుంది : హరీశ్ రావు
Delhi Capitals | దిల్లీ క్యాపిటల్స్‌కు మహేల జయవర్దనే.. తొలి టైటిల్ సాధించేనా..!
ఉర్సు వేడుకలను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కోరం కనకయ్య
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

