కొత్తపల్లి, అక్టోబర్ 9 : సీఎం కప్-2024 క్రీడోత్సవాలకు సంబంధించిన క్రీడాజ్యోతి ర్యాలీ బుధవారం కరీంనగర్‌కు చేరుకున్నది. అలుగునూర్ చౌరస్తా నుంచి కమాన్ మీదుగా అంబేదర్ స్టేడియం వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర 800మంది క్రీడాభిమానులతో ర్యాలీ అట్టహాసంగా సాగింది. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, సీపీ అభిషేక్ మొహంతి, ఇతర అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు కమాన్ చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నవంబర్‌లో సీఎం కప్-2024 పేరిట ప్రభుత్వం పోటీలు నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ పోటీల్లో గ్రామీణ ప్రాంత క్రీడాకారులు ఎకువ సంఖ్యలో పాల్గొనాలన్నారు. అంబేదర్ స్టేడియంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సుడా చైర్మన్, జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, నగరపాలక కమిషనర్ చాహత్ భాజ్‌పేయి, యువజన క్రీడల అధికారి వీ శ్రీనివాస్‌గౌడ్, డీఆర్వో పవన్‌కుమార్, ఆర్డీవో మహేశ్వర్, ఏసీపీ నరేందర్, జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, కోశాధికారి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, 33 జిల్లాల టార్చ్ ఇన్చార్జి నోడల్ ఆఫీసర్ మధు, అలెగ్జాండర్, ఎన్‌వైకే అధికారి వెంకటరాంబాబు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.