కరీంనగర్ ఉమ్మడి జిల్లా అగ్నిగుండాన్ని తలపిస్తున్నది. రోజురోజుకూ భానుడి ప్రతాపంతో నిప్పుల కుంపటిలా తయారవుతున్నది. ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, అంబటాళ్ల నుంచే ఎండ మండుతున్నది. సోమవారం గరిష్ఠంగా 43 డిగ్రీలకుపైగా నమోదు కావడం, పొద్దంతా వేడి గాలులు వీయడం, భరించలేని ఉక్కపోతతో ప్రజానీకం తల్లడిల్లుతున్నది.
మధ్యాహ్నం వేళ ఇండ్ల నుంచి కాలు బయటపెట్టేందుకు జంకుతున్నది. కోల్బెల్ట్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఈ ప్రాంతంలో వారం నుంచే 40 డిగ్రీలు దాటుతుండగా, పొద్దంతా భగ్గుమంటున్నది. ఇప్పుడే ఇలా ఉంటే మేలో ఎంతలా ఉంటుందో తలుచుకుంటేనే ముచ్చెమటలు పడుతున్నవి.