హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 24 : పట్టణానికి చెందిన విద్యార్థి సముద్రాల వికాస్ సీఏ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్(సీఎంఏ) పరీక్షల్లో జాతీయ స్థాయిలో 35 ర్యాంకు సాధించి ప్రతిభ చాటాడు. వేణుగోపాల్-రమాదేవి దంపతుల కొడుకైన వికాస్ ఈ ఏడాది జూలైలో చార్టెడ్ అకౌంటెన్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. అదే పట్టుదలతో ఇష్టంగా చదివి 16 వేల మందికి పైగా రాసిన సీఎంఏ పరీక్షల్లో 35వ ర్యాంకు సాధించాడు.
వికాస్ మొదటి నుంచి విద్యలో రాణిస్తుండగా, చార్టెడ్ అకౌంటెంట్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సాహం అందించారు. వికాస్ ఐదో తరగతి వరకు కరీంనగర్‌లోని ప్రైవేట్ పాఠశాల, ఆరు నుంచి పది తరగతి వరకు కరీంనగర్‌లోని ప్రభుత్వ సవరణ్ స్కూల్, ఇంటర్మీడియట్ తిమ్మాపూర్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్, సీఏ హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లోని లక్ష్య అకాడమీలో చదివాడు.
కాగా, వికాస్‌కు హుజూరాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ గందె రాధికా శ్రీనివాస్, విశ్రాంత డిప్యూటీ డీఈవో ఆలేటి మదన్‌మోహన్‌రెడ్డి, కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డి, తాళ్లపెల్లి శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఎస్ రాజేంద్రప్రసాద్, తదితరులు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.