సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాలి
కలెక్టర్ ఆర్వీ కర్ణన్
కరీంనగర్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ)/హుజూరాబాద్ టౌన్: హుజురాబాద్ అసెంబ్లీ ని యోజకవర్గ ఉప ఎన్నిక నిర్వాహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎ న్నికల నోడల్ అధికారులు, సెక్టోరల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో ఫ్ల యింగ్ స్వాడ్, స్టాటిస్టిక్స్ సర్వేవ్లైన్స్ బృందాలు, సెక్టోరల్ అధికారులకు బుధవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణతో కలిసి హాజరయ్యారు. అంతకుముందు కళాశాలలో ఏర్పాటు చేసే రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల కోసం స్థలంతో పాటు కళాశాలలోని గదులను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లో ఉంటుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థల గోడలపై ఎలాంటి వాల్ రైటింగ్స్ చేయకూడదని ఆదేశించారు. అనుమతి లేని ప్ర చార హోర్డింగ్‌లను తొలగించాలన్నారు. రోడ్ల వెం బడి విద్యుత్ స్తంభాలపై ఎలాంటి ప్రచార ఫ్లెక్సీలు ఉండకూడదని సూచించారు. రోడ్ షోలు, సైకిల్, బైకు ర్యాలీలు, పాదయాత్రలకు అనుమతి లేదన్నారు. స్టార్ క్యాంపెయినర్ల ప్రచారానికి వెయ్యి మందికి, ఇతర సమావేశాలకు 500 మందికి మా త్రమే అనుమతి ఉన్నదన్నారు. ఇంటింటి ప్రచారంలో 5 గురు మాత్రమే పాల్గొనాలని, సెక్టోరల్ ఆఫీసర్లు ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సమాచారం వస్తే వెంటనే స్పం దించి వెళ్లాలని ఆదేశించారు. సెక్టోరల్ ఆఫీసర్లు త మ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో ర్యాం పులు, లైటింగ్, వాష్ రూంలు, విద్యుత్ సౌకర్యం ఉన్నవి లేనివి తనిఖీ చేయాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల వద్ద ఓట ర్లు వర్షానికి తడువకుండా షెడ్లు వేయించాలని సూచించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా అధికారు లు చర్యలు చేపట్టాలని అన్నారు.
కలెక్టరేట్లో వ్యాక్సినేషన్ సెంటర్
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది రెండు డోసుల కోవిడ్ టీకా తీసుకొని ఉండాలని, ఇందుకు కలెక్టరేట్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. డ్రైవర్లు, అటెండర్లు కూడా రెండు డోసు ల వ్యాక్సిన్లు తీసుకొని ఉండాలన్నారు.
సిబ్బందికి శిక్షణ తరగతులు
హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ లో పాల్గొనే ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇతర పోలింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అక్టోబర్ 4న మొదటి విడుత శిక్షణ తరగతులు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. రెండో విడుత ట్రైనింగ్ అక్టోబర్ 18న నిర్వహించాలన్నారు. ప్రతి శిక్షణ కార్యక్రమంలో ఈవీఎం మిషన్లు ఉండాలని, ఈవీఎం మిషన్ల వినియోగంపై కూడా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో ఈవీఎంల ద్వారా ఓటు వేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. 5 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో 7 టీంలను ఏర్పాటు చేసి అక్టోబర్ 5 నుంచి 20 లోగా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలను పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల సిబ్బంది రవాణాకు ఆర్టీసీ బస్సులను సమకూర్చాలని డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌ను క లెక్టర్ ఆదేశించారు. సెక్టోరల్ ఆఫీసర్లందరికీ వాహనాలు సమకూర్చాలని అన్నారు. ఎన్నికల ప్రొ ఫైల్ తయారు చేయాలని ముఖ్య ప్రణాళిక అధికారిని ఆదేశించారు.సీపీ సత్యనారాయణ మాట్లాడు తూ శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరా రు. రాజకీయ పార్టీలు మద్యం, చీరలు, గడియారాలు, బహుమతులు, పది వేలకుపైగా విలువైన వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిస్తే వెంటనే వీడి యో తీయడంతో పాటు వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించి కేసులు నమోదు చేయాలని ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ సిబ్బందిని ఆదేశించారు. రిటర్నింగ్ ఆఫీసర్ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావద్దని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్‌లాల్, గరీమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్ హుజూరాబాద్ ఆర్డీవో ర వీందర్‌రెడ్డి, తహసీల్దార్లు, డీసీపీ పుష్ప, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ఎం శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ జనార్దన్, ఏసీపీలు కోట్ల వెంకట్‌రెడ్డి, పీ శ్రీనివాస్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.