టీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు
పార్టీలో రోజురోజుకూ పెరుగుతున్న వలసలు
కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
జమ్మికుంట/ఇల్లందకుంట/ వీణవంక/ జమ్మికుంట రూరల్, సెప్టెంబర్ 29: టీఆర్ఎస్ బలం పెరుగుతున్నది. వివిధ సంఘాలే కాదు పార్టీల నాయకుల మద్దతు లభిస్తున్నది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై సకల జనం కారుకు జైకొడుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీలో చేరిపోతున్నది. బుధవారం వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, ప్రజలు గులాబీ కండువా కప్పుకొన్నారు. టీఆర్ఎస్ వెంటే ఉంటామని ప్రకటించారు.
టీఆర్ఎస్తోనే సంక్షేమం: ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
కులవృత్తులకు జీవం పోసిన ఘనత సీఎం కేసీఆర్‌దని, టీఆర్ఎస్తోనే సంక్షేమమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉద్ఘాటించారు. వీణవంక మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన 60 యాదవ కుటుంబాలు బుధవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరగా, గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు ఏ నాయకుడు, ఏ పార్టీ కూడా కులవృత్తులను పట్టించుకున్న దాఖలాలు లేవని, గొల్ల, కుర్మలు దుర్భర జీవితాలు గడిపారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆలోచన చేసి వారి ఆర్థికాభివృద్ధి కోసం గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారని కొనియాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి రానున్న ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ ఉపసర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, నాయకులు చిన్నాల అయిలయ్య, కర్ర దేవరాజ్ యాదవ్, మర్రి స్వామి ఉన్నారు.
గాంధీజీ కలలకు ప్రతిరూపం కేసీఆర్ పథకాలు: ఎమ్మెల్యే అరూరి రమేశ్
గాంధీజీ కలలకు ప్రతిరూపం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అభివర్ణించారు. బుధవారం జమ్మికుంట మండలం శంభునిపల్లిలో విశ్వబ్రాహ్మణ, ఆరె, కుమ్మరి కులస్తులు ఎమ్మెల్సీ పోచంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలను పొందుతున్నారని కొనియాడారు. టీఆర్ఎస్కు పెద్దల ఆశీస్సులు కావాలని కోరారు. శంభునిపల్లి అభివృద్ధి కోసం రూ.కోటీ 15లక్షల 57వేలను సీఎం మంజూరు చేశారని చెప్పారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఈటల రాజేందర్ ప్రజలను పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాతుమండి మహేందర్, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రుద్రారపు శ్రీనివాస్, ఆరె కుల అధ్యక్షుడు ఇంగె రామారావు, ఉప సర్పంచ్ సంపత్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధిని పట్టించుకోలే: ఎమ్మెల్సీ పోచంపల్లి
మంత్రిగా, ఎమ్మెల్యేగా ఏండ్లకేండ్లు పాలించిన ఈటల రాజేందర్ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం జమ్మికుంట మండలం వావిలాలలో ట్రాక్టర్ ఓనర్స్, డ్రైవర్ల అసోసియేషన్ నాయకులు, సభ్యులు టీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం సీఎం కేసీఆర్ నాలుగు వేల ఇండ్లు మంజూరు చేస్తే ఈటలకు ఒక్కటీ కట్టలేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని ప్రకటిస్తే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మంత్రులను కలిసి మరో 20లక్షల మెట్రిక్ టన్నులు కొనేందుకు ఒప్పించారని కొనియాడారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించాలని కోరారు. ఇక్కడ ట్రాక్టర్ ఓనర్స్, డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మామిడి రవికుమార్, టీఆర్ఎస్ నాయకుడు రమేశ్, ఎంపీటీసీ మర్రి మల్లేశం, కో ఆప్షన్ సభ్యుడు రఫీ, సంఘం నాయకులు కొండల్రావు, కిషన్‌రావు, స్వామి, చందు, నగేశ్, శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు సతీశ్‌యాదవ్, సాయితేజ ఉన్నారు.
టీఆర్ఎస్లోకి గణపతిరెడ్డి
ఇల్లందకుంట, సెప్టెంబర్ 29: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు సింగిల్‌విండో మాజీ చైర్మన్ గణపతిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఇల్లందకుంటలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా, ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్కడ పీఏసీఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, మాజీ ఎంపీటీసీ రాంస్వరణ్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దేవన్న, కుమార్, విక్రం, రాజిరెడ్డి, రాజబాబు పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ పెద్ది కుమార్, మాజీ సర్పంచ్ పెద్ది స్వరూప బుధవారం రాత్రి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, నాయకులు దేవన్న, రాజేశ్వర్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గణపతిరెడ్డి, కుమార్, విక్రమ్, వేణు, ప్రశాంత్, రాజిరెడ్డి, రమేశ్ ఉన్నారు.