నియోజకవర్గంలో 55 వేల ఎకరాలకు సాగునీరు
రుద్రంగి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
రుద్రంగిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన
రుద్రంగి, ఆగస్టు 29: 70ఏండ్లలో జరగని అభివృద్ధి టీఆర్ఎస్ ఏడేండ్ల పాలనలో చేసిందని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఉద్ఘాటించారు. ఎల్లంపల్లి జలాలను తరలించిన నియోజకవర్గంలోని 55 వేల ఎకరాలకు నీరందిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గానికి గుండెకాయలాంటి రుద్రంగిని అన్ని రంగాల్లో ముందునిలుపుతానని పేర్కొన్నారు. ఆదివారం తాను దత్తత తీసుకున్న రుద్రంగిలో పర్యటించారు. జడ్పీచైర్ పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి సెంట్రల్ లైటింగ్, రైతు వేదిక, ప్రభుత్వ పాఠశాల అదనపు గదులు ప్రారంభించారు. కేజీబీవీ పాఠశాల, హెల్త్ సెంటర్లకు భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం విద్య, వైద్యరంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలపై మమకారంతో సేవ్స్ ద్వారా జూనియర్ కళాశాల, సుమారు 50బోర్లు వేసి తాగునీరం దించామని గుర్తు చేశారు.
నిజాయితీతో సేవలందిస్తే ప్రజలు ఆశీర్వదిస్తారని, తప్పుడు మార్గంలో వెళ్తే తగిన గుణపాఠం చెబుతారన్నారు. రైతాంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. అనంతరం 39 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, ఐదుగురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎంపీ పీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ గట్ల మీన య్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కిషన్‌రావు, వైస్ ఎంపీపీ పీసరి చిన్నభూమయ్య, పంచాయతీరాజ్ డీఈ భూమే శ్, డిప్యూటీ తహసీల్దార్ మల్లయ్య, ఎంపీడీవో శంకర్, మండల అధికారులు, సర్పంచ్ తర్రె ప్రభలత, ఎంపీటీసీలు మంచె లావణ్య, చెప్యాల ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.