కరీంనగర్ రూరల్: జూన్ 26: కరీంనగర్ లోయర్ మానేరు రిజర్వాయర్ (ఎల్ఎండీ) లో బుధవారం 29 కేజీల చేప చిక్కింది. తెల్లవారుజామున చేపల వేటకు వెళ్లిన కూర పురుషోత్తం వేసిన కచ్చు వలలో పడ్డది.
పెద్ద చేపను చూసి మత్స్యకారుడు సంబురపడ్డాడు. దీనిని మార్కెట్లో 4600కు విక్రయించానని సంతోషంగా చెప్పాడు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద చేప దొరకలేదని పేర్కొన్నాడు.