ధర్మపురి, నవంబర్ 28 : ధర్మపురి క్ష్రేతంలో గోదావరి హారతి కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. గోదావరి హారతి ఉత్సవ సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు పోల్సాని మురళీధర్రావ్, ధర్మపురి శ్రీమఠం అధిపతి సచ్చితానంద సరస్వతి స్వామితో పాటు వేదపండితులు గోదావరి నది స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన హారతి వేదిక వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, యువతులు దీపాలను నదిలో వదిలారు. భక్తులు హారతి కార్యక్రమాన్ని తిలకించి పుణ్యప్రాప్తి పొందారు. వేదాలకు, ఇతిహాసాలకు, పురాణాలకు ధర్మపురి క్షేత్రం కేంద్రీభూతమై ఉన్నదని ఈ సందర్భంగా సచ్చితానంద సరస్వతి పేర్కొన్నారు. త్రయంబక క్షేత్రం నుంచి అంతర్వేది వరకు ప్రవహించే అఖండ గోదావరి నది ధర్మపురి క్షేత్రంలో చాలా ప్రత్యేకమైనదన్నారు. గోదావరి అంటే నీరు కాదనీ, మానవాళికి జీవన విధానమన్నారు. గోదావరి పవిత్రతను కాపాడాలన్నారు. ఇక్కడ హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కన్వీనర్ వీరగోపాల్, రాష్ట్ర కో కన్వీనర్ దామెర రామ్సుధాకర్, దైవజ్ఙశర్మ, పాలెపు మనోహరశర్మ, జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ, క్యా తం వెంకటరమణ, కన్నం అంజయ్య, శ్రీనివాస్, బండారి లక్ష్మణ్, గాజు భాస్కర్, కస్తూరి శరత్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.