జ్యోతినగర్, అక్టోబర్ 28: అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మండలి విప్ భానుప్రసాద్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాల్లో జడ్పీచైర్మన్ పుట్ట మధూకర్ అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వవిప్ హాజరై మాట్లాడారు. సీఎం నిర్ణయం మేరకు గత ఏడాది మాదిరిగానే రైతులకు అండగా గ్రామా ల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని మద్దతు థరకు కొనుగోలు చేయ్యనున్నట్లు తెలిపారు. జిల్లాలో 2.11లక్షల ఎ కరాల్లో వరి సాగు జరిగిందని, దాదాపు 5.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంద ని, జిల్లా వ్యాప్తంగా 292 కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటు చేసి 4.6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు ఏర్పాట్లు చేస్తున్నామని, 11 లక్షల గన్నీ సంచులు రైసు మిల్లర్ల వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. మిగిలి ఉన్న 15 లక్ష ల గన్నీ సంచులను సంచులను సప్లయిదారుల నుంచి ఏర్పాటు చేస్త్తామన్నారు. జిల్లాలోని గ్రామాల్లో పల్లె ప్రగతి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయ్యాలన్నారు. గ్రామాలను హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు పట్టిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించా రు. జడ్పీటీసీలు, ఎంపీటీసీల కార్యాలయ ఏర్పాటుకు, జాతీయ పర్వదినాలకు జాతీయపతాకావిష్కరణ చేయడానికి వీలుగా త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ కింద చేపడుతున్న పనులు గ్రామాభివృద్ధి, పంచాయతీ రాజ్ పనులు, ధాన్యం కొనుగోలు, తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. జిల్లా కలెక్టర్ సంగీతా సత్యనారాయణ మాట్లాడు తూ సమావేశంలో ప్రజాప్రతినిధులు సూచించిన అంశాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా రెండో డోసు తీసుకోవాలన్నారు. ఇక్కడ స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, జడ్పీ సీఈఓ మొగిలి శ్రీనివాస్, జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఆయా విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.