నెలరోజుల్లో పనులు పూర్తి
నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటాం
హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్
చిగురుమామిడి, డిసెంబర్ 27: గౌరవెల్లి ప్రాజెక్ట్‌పై రాజకీయం చేయడం సరికాదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను సోమవారం ఎంపీపీ కొత్త వినీత-శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ద్వారా నిర్వాసితులకు రూ.8 లక్షల చొప్పున పరిహారమిచ్చినట్లు చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ పరిధిలో 80ఎకరాల భూసేకరణ మాత్రమే మిగిలి ఉందన్నారు. నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం జరిగినప్పటికీ కొన్ని పార్టీల నాయకులు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇకనైనా రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తోటపల్లి రిజర్వాయర్ ద్వారా త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు నీరు అందిస్తామన్నారు ప్రాజెక్ట్ పనులు నెల రోజుల్లోగా పూర్తి చేస్తామన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నియోజకవర్గంలోని నిరుద్యోగుల కోసం ఉచితంగా కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు.
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
మండల కేంద్రంలోని రైతువేదికలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెకులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పా రు. కేంద్రం రైతులపై వివక్ష చూపుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత-శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ ముబీన్ అహ్మద్, ఎంపీడీవో విజయలక్ష్మి ఎస్ఐ దాస సుధాకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, సర్పంచులు బెజ్జంకి లక్ష్మణ్, ముప్పిడి వెంకటనరసింహారెడ్డి, బోయిని శ్రీనివాస్, కానుగంటి భూమిరెడ్డి, పెదపల్లి భవాని, చెప్యాల మమత, పీచు లీల, ఎంపీటీసీలు మిట్టపల్లి మల్లేశం, పెసరి జమున, మంకు స్వప్న, రావుల రమేశ్, అందె స్వప్న, కో ఆప్షన్ సభ్యుడు మక్బూల్ పాషా, విండో వైస్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్, పెద్దపెల్లి అరుణ్‌కుమార్, తాటికొండ సందీప్‌రెడ్డి, మామిడి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.