మంథని రూరల్, అక్టోబర్ 27: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటుగా విద్యాలయాలను మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఎక్లాస్పూర్ హైస్కూల్ విద్యార్థులకు సోలార్స్టడీ ల్యాంప్స్, ఫ్యాన్స్, ఉచిత లైబ్రరీ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం చేపట్టగా, ఆయన ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో లైబ్రరీ, రూ. 4లక్షల ఎమ్మెల్సీ నిధులతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అలాగే ఎమ్మార్సీ ప్రహరీ నిర్మాణం కోసం నిధులను అందిస్తామని తెలిపారు. జిల్లాలో 15 పాఠశాలలకు టీఎస్ ఆర్‌ఈడీసీవో సంస్థ ద్వారా విద్యార్థులకు సోలార్ ల్యాంప్స్ అందించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. ఇప్పటికే తన హయాంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు బెంచీలను, మౌలిక వసతులను కల్పించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లు ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో హెచ్ఎం సంపత్‌రావు, ఎంఈవో దాసరి లక్ష్మి, ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తరగం సుమలత, సర్పంచ్ చెన్నవేన సదానందం, ఉపాధ్యాయులు కర్రు సురేశ్, కృష్ణమూర్తి, సుచిత్ర, సుజాత, శ్రీకాంత్, కుమార్, కుమారస్వామి, ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ చలువాజీ నాగేశ్వర్రావు తదితరులున్నారు.