వీణవంక, అక్టోబర్ 27: ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. బుధవారం మండలంలోని కనపర్తి గ్రామంలో ఆయన ఇంటింటా ప్రచారం చేశారు. ప్రధాన వీధులకు ర్యాలీగా వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఆయాచోట్ల సండ్ర మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. అభినవ అంబేద్కర్ కేసీఆర్ దళితబంధును ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఓటమి భయంతో బీజేపీ నాయకులు ఎన్నికల సంఘానికి లేఖ రాసి దళితబంధును నిలిపివేయించారన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ధరలు పెంచుతూ పేదల నడ్డివిరుస్తున్నదని మండిపడ్డారు. బండి సంజయ్‌ని గెలిపిస్తే ఏమీ చేయలేదని, ఇప్పుడు ఈటల గెలిచినా ఎలాంటి అభివృద్ధి జరుగదన్నారు. కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. విండో మాజీ చైర్మన్ మాడ సాధవరెడ్డి, సర్పంచ్ పర్లపెల్లి రమేశ్, గ్రామ శాఖ అధ్యక్షుడు శశికుమార్, ఏఎస్ఆర్ యువసేన శ్రీనివాస్‌రెడ్డి, విజయ్, వినయ్, కోల శ్రీనివాస్, రాకేశ్, మల్లేశ్, మాజీ సర్పంచ్ శ్యాంసుందర్‌రెడ్డి, నాయకులు తిరుపతి, కవిత, అనూష, నర్సయ్య, బొందయ్య, సందీప్, కోమల్‌రెడ్డి, వెంకటేశ్, పులి ప్రకాశ్, హుస్సేన్ పాల్గొన్నారు.