హుజూరాబాద్‌లో టీఆర్ఎస్దే విజయం
బీజేపీ అడ్రస్ గల్లంతే
టీఆర్ఎస్ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వీ అర్జున్
హుజూరాబాద్‌టౌన్, జూన్27: ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు అని, ఆయన పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందున్నదని టీఆర్ఎస్ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వీ అర్జున్ ఉద్ఘాటించారు. టీఆర్ఎస్పై బీజేపీ నేతల విమర్శలు అర్థరహితమని.. వచ్చే ఎన్నికల్లో కమలం అడ్రస్ గల్లంతుకావడం ఖాయమన్నారు. ఆదివారం ఆయన హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. దళిత ఎంపవర్మెంట్ పథకం విధివిధానాలపై సోమవారం సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ ఎందుకు బహిష్కరిస్తున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల కోసం సీఎం కేసీఆర్ ఇంత గొప్ప పథకానికి శ్రీకారం చుడితే అభినందించాల్సింది పోయి గైర్హాజరుకావడంలో ఆంతర్యమేమిటని దుయ్యబట్టారు. ఈటల రాజీనామాకు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏం సంబంధమని, ఆయన ప్రజల కోసం రాజీనామా చేశాడా చెప్పాలని ప్రశ్నించారు. వ్యక్తిగత ఆత్మాభిమానం ముఖ్యమా..? ప్రజల ఆత్మాభిమానమా చెప్పాలన్నారు. తెలంగాణలో ఒక కొత్త రేషన్ కార్డు, పింఛన్ మంజూరు కాలేదని చెప్పే ఈటల.. మరి ఆనాడే ఎందుకు రాజీనామా ఇవ్వలేదని ప్రశ్నించారు. కేవలం తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ డ్రామా అని, ప్రజలు గమనించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఈటలకి హుజూరాబాద్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని.. అందరూ టీఆర్ఎస్ వెంటే ఉన్నారని చెప్పారు. ఎంతో మంది రైతులకు అన్నం పెట్టే కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదాతోపాటు మన పకన ఉన్న కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఈటల పోరాటం చేస్తే కాస్త ప్రజలు విశ్వసించే అవకాశం ఉంటుందని హితవుపలికారు. నాడు కేంద్రం తెచ్చిన నల్లాచట్టాలను వ్యతిరేకించి.. ఇప్పుడే అదే పార్టీలో చేరిన ఈటల రేపు హుజూరాబాద్ ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ యూత్‌ఫోర్స్ జిల్లా కన్వీనర్ తిప్పరిశెట్టి శ్రీనివాస్, కో కన్వీనర్ తాటిపాముల కమలాకర్, నాయకులు భూపతి రాకేశ్, సాయివిశాల్, సంజయ్ పాల్గొన్నారు.