టీఆర్ఎస్ నాయకులు
రాయికల్, జనవరి 26: గత ఎన్నికల్లో మోసపూరితమైన హామీలతో గెలిచిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని రాయికల్ పట్టణ టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు మోర రామ్మూర్తి పేర్కొన్నారు. రాయికల్ పట్టణంలో యువజన నాయకులు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానని తప్పుడు హామీలతో గెలిచి ఇప్పుడు మొహం చాటేస్తున్న అర్వింద్‌పై రైతులు దాడి చేయడం తప్పేమి కాదన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్న అర్వింద్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురావడంపై దృష్టి సారించాల్సింది పోయి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చేతకాని తనానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైన విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు తు రగ శ్రీధర్ రెడ్డి, వల్లకొండ మహేశ్, మహేందర్ నా యక్, యువజన నాయకులు ఎలిగేటి అనిల్, చం ద్ర తేజ, సంజీవ్, హుస్సేన్, చైతన్య పాల్గొన్నారు.