కార్పొరేషన్, జనవరి 26: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావును కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ విజయ, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్ కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, గుంజపడుగు హరిప్రసాద్, కల్పన, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కమాన్‌చౌరస్తా/తెలంగాణచౌక్, జనవరి26: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావును టీఆర్ఎస్ ఉద్యమ నాయకురాలు గందె కల్పన-విశ్వేశ్వర్ రావు దంపతులు, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
రామడుగు, జనవరి 26: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావును టీఆర్ఎస్ నాయకుడు, జై తెలంగాణ ఫౌండేషన్ చైర్మన్ సాతర్ల వివేకానంద మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.