కమాన్‌చౌరస్తా, ఆగస్టు 25 : ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఎంసెట్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ విద్యార్థులు సత్తా చాటారు. కళాశాలకు చెందిన 75 మంది విద్యార్థులు 5వేల లోపు ర్యాంకు సాధించారు. ఇందులో డీ వైష్ణోవి 217వ ర్యాంకు, ఎస్ అజిత్ 490వ ర్యాంకు, ఎస్ హర్షిత్‌రెడ్డి 692వ ర్యాంకు, తేజస్విని 843వ ర్యాంకు, సంజనా 854వ ర్యాంకు, రుక్సర్ 875వ ర్యాంకు సాధించారని చెప్పారు. అనంతరం విద్యార్థులను చైర్మన్, అధ్యాపకులు బొకేలు అందజేసి సత్కరించారు.
ట్రినిటీ విద్యార్థుల ప్రతిభ
కమాన్‌చౌరస్తా, ఆగస్టు 25: ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపినట్లు విద్యాసంస్థల కరస్పాండెంట్ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను ప్రిన్సిపాళ్లు ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు. ఎంసెట్ ఫలితాల్లో జిల్లాలో మొదటి స్థానం సాధించడం వెనుక ఉన్న ట్రినిటీ విద్యాసంస్థల అధ్యాపకులు, సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రమంలో కళాశాలకు చెందిన ఎం లలిత్ రెడ్డి 539వ ర్యాంకు, ఎం నవీన్ 1367వ ర్యాంకు, వీ రాము 2991వ ర్యాంకు, ఆముక్తమాల్యద 4526వ ర్యాంకు సాధించారన్నారు. అలాగే, మెడికల్ విభాగంలో రాష్ట్రస్థాయిలో అష్రఫ్ 524వ ర్యాంకు, ఎన్ స్నేహ 652వ ర్యాంకు, నజ్రానా 1059వ ర్యాంకు సాధించినట్లు చెప్పారు. సందర్భంగా విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సత్కరించారు.
శ్రీచైతన్య విద్యార్థులు
కమాన్‌చౌరస్తా, ఆగస్టు 25: ఎంసెట్ ఫలితాల్లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రమంలో కళాశాలకు చెందిన ఈ లిఖిత 219 వ ర్యాంకు, జాగృతి 941, ఎన్ శివకృష్ణ 1859, ఎండీ హుస్సేన్ ఖాన్ 2230, ఎం సాయితేజ 2531 సాధించారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళాశాల స్థాపించిన మొదటి బ్యాచ్ లోనే ఈ అద్భుత ర్యాంకులు సాధించిన శ్రీచైతన్య అణిముత్యాలకు వారి తల్లిదండ్రులకు, ఈ విజయానికి తోడ్పడిన అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ నరేందర్ రెడ్డి, డీన్ జగన్ మోహన్ రెడ్డి, ఏజీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్‌కు వాసికి 81వ ర్యాంక్
హుజూరాబాద్‌టౌన్, ఆగస్టు 25: ఇంజినీరింగ్ విభాగంలో హుజూరాబాద్‌కు చెందిన శ్రీరామ్ విశాల్ 81వ ర్యాంకు సాధించాడు. పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీరామ్ చక్రధర్-మవొజల దంపతుల కుమారుడు విశాల్‌కు రాష్ట్ర స్థాయిలో ఈ ర్యాంకు రావడంపై పలువురు అభినందించారు.
కరీంనగర్ వాసి..
కమాన్‌చౌరస్తా, ఆగస్టు 25 : కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మూల మహేందర్‌రెడ్డి కుమారుడు మూల అభిరామ్ రెడ్డి 127.71 మారులు సాధించి రాష్ట్ర స్థాయిలో 265 వ ర్యాంక్ సాధించాడు. కాగా, అభిరామ్ జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియాలో 99.9 పర్సంటైల్ సాధించి ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక పర్సంటైల్‌ని సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.